Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రక్తపు మరకలపై సీఐ నాగరాజును ప్రశ్నించిన సిట్‌ అధికారులు

రక్తపు మరకలపై సీఐ నాగరాజును ప్రశ్నించిన సిట్‌ అధికారులు

వార్త 6 days ago

Saikrishna case : సాయికృష్ణ అదృశ్యం/మృతి కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సస్పెండైన విజయవాడ కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును ప్రత్యేక విచారణ బృందం (SIT) అధికారులు రెండో రోజు సుదీర్ఘంగా విచారించారు.

సుమారు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారుల ప్రశ్నలకు సీఐ నాగరాజు ఎక్కువగా దాటవేత ధోరణిని ప్రదర్శించడమే కాకుండా, పలు కీలక ప్రశ్నలకు మౌనమే సమాధానంగా ఊరుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇంటరాగేషన్ గదిలో లభించిన ఆధారాలపై సిట్ అధికారులు సీఐ నాగరాజును తీవ్రంగా నిలదీశారు. ఇంటరాగేషన్ గదిలో రక్తపు మరకలు ఎందుకు ఉన్నాయి? అవి ఎవరివి? అని ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదని నాగరాజు సమాధానమిచ్చారు.ఆధారాలు తుడిచేసేందుకే ఆ గదికి పెయింటింగ్ వేయించారా అని ప్రశ్నించగా, తన ఆదేశాల మేరకే పెయింటింగ్ వేయించినట్లు ఓ కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చాడని సిట్ అధికారులు గుర్తుచేశారు. దీనికి స్పందిస్తూ “ఎందుకు అలా చెప్పాడో ఆ కానిస్టేబుల్ నే అడగండి, నాకు సంబంధం లేదు” అని నాగరాజు తప్పించుకునే ప్రయత్నం చేశారు.టాస్క్‌ఫోర్స్ బృందం మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకువచ్చి కృష్ణలంక స్టేషన్ సెంట్రీలకు అప్పగించిందని, ఆ విషయం తన దృష్టికే రాలేదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Read Also: AP corona cases: ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

 Saikrishna case

Saikrishna case : ఆర్ఎమ్‌పీ ఇంజెక్షన్, ఆధారాలపై మౌనం

బాధితుడు సాయికృష్ణకు స్టేషన్‌లో ఇచ్చిన వైద్యంపై సిట్ అధికారులు సీఐని గట్టిగా ప్రశ్నించారు.

  • ఆర్ఎమ్‌పీ వైద్యం: స్టేషన్‌కు ఆర్ఎమ్‌పీ (RMP) వైద్యుడిని పిలిపించి సాయికృష్ణకు ఇంజెక్షన్ ఎందుకు ఇప్పించాల్సి వచ్చిందని అడగ్గా.. ఆ విషయం తనకు తెలియదని, పిలిచిన కానిస్టేబుల్‌నే అడగాలని సమాధానమిచ్చారు.
  • ఆధారాలు చూపినా మౌనమే: విచారణకు సహకరించకపోవడంతో ఇప్పటివరకు సేకరించిన సాంకేతిక, ప్రత్యక్ష ఆధారాలను సిట్ అధికారులు ఆయన ముందుంచారు. అయితే ఆ ఆధారాలను చూసిన సీఐ నాగరాజు ఏ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం రోజుల కస్టడీ

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సీఐ నాగరాజును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ అధికారులు వారం రోజుల పాటు విచారించనున్నారు. ఇంఛార్జి జడ్జి ముందు హాజరుపరిచిన అనంతరం, ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని కోర్టు ఆదేశించింది. విచారణ అంతా సీసీటీవీ (CCTV) కెమెరాల నిఘా మధ్యే జరగాలని, నాగరాజుకు తగిన భద్రత కల్పించాలని కోర్టు స్పష్టం చేయడంతో సిట్ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.

Epaper: epaper.vaartha.com

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానాలు.. ఇదే పూర్తి షెడ్యూల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha