Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ కు చలానా!

రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ కు చలానా!

వార్త 2 weeks ago

Wrong route driving:హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చుట్టూ తిరగడం కష్టమని చాలామంది వాహనదారులు రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఈ సమస్యను నివారించడానికి పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, పంజాగుట్ట, లక్డీకాపూల్, టోలిచౌకి, రాయదుర్గం, బేగంపేట్, సోమాజిగూడ, అమీర్ పేట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు కనిపించకపోయినా సీసీటీవీ కెమెరాలు ప్రతి కదలికను రికార్డ్ చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారి మొబైల్ ఫోన్లకు క్షణాల్లోనే చలానా మెసేజ్ లు వస్తున్నాయి. దీనివల్ల వాహనదారులు తప్పు తెలుసుకొని నిబంధనలు పాటించేలా మారుతున్నారు.

Read also: Hyderabad Draft Voter Deletion List : హైదరాబాద్ ఓటర్ల జాబితా సవరణ: ముసాయిదా తొలగింపు జాబితాలో విడ్డూరం

 CCTV surveillance on wrong-way driving

ఆరు లక్షలకు పైగా చలానాలు జారీ చేసిన పోలీసులు

నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా జరుగుతున్న వందకు పైగా ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ముప్పై రెండు ప్రధాన రూట్లలో సీసీ కెమెరాలను అమర్చారు. గత ఐదు నెలల కాలంలో సుమారు ఆరు లక్షలకు పైగా చలానాలను విధించారు. డెలివరీ బాయ్స్ తొందరపాటు కారణంగా ఇలాంటి తప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో గోల్కొండ జోన్ పరిధిలో వేల సంఖ్యలో ఉన్న ఉల్లంఘనలు ఇప్పుడు చలానాల మోత కారణంగా భారీగా తగ్గాయి. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఈ ప్రత్యేక చర్యలు చేపట్టింది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

Wrong route driving:నకిలీ నంబర్ ప్లేట్లతో వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు

ట్రాఫిక్ నిబంధనలను తప్పించుకోవడానికి నకిలీ లేదా ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లను వాడుతున్న వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ గౌరవించి సురక్షిత ప్రయాణం చేయాలని పోలీస్ శాఖ కోరుతోంది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. వాహనదారులు బాధ్యతగా నడుచుకుంటూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్లపై దానం వార్నింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha