Dailyhunt
రానున్న 2 రోజుల్లో దంచికొట్టనున్న వర్షాలు!

రానున్న 2 రోజుల్లో దంచికొట్టనున్న వర్షాలు!

వార్త 3 days ago

IMD rain alert: భగభగమండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. రానున్న రెండు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ, వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.

Read Also: Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు.. రైతులకు హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే, వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, వడగళ్ల వాన పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, రైతులు తమ పంటను కాపాడుకునేలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

IMD rain alert: చల్లబడనున్న వాతావరణం

గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. తాజా వర్ష సూచనతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. అకాల వర్షాల నేపథ్యంలో బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

విశాఖ జిల్లాలో భారీ వర్షాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha