Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాశీ ఖన్నాకు రజనీకాంత్ ప్రత్యేక బహుమతి!

రాశీ ఖన్నాకు రజనీకాంత్ ప్రత్యేక బహుమతి!

వార్త 3 weeks ago

Raashi Khanna: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నుంచి తాను అందుకున్న ఒక అమూల్యమైన, ప్రత్యేక బహుమతి గురించి ప్రముఖ నటి రాశీ ఖన్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న బిగ్ ప్రాజెక్ట్ 'ధర్మన్‌' చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఆమెకు శ్రీ స్వామి రామ రచించిన 'లివింగ్‌ విత్‌ ది హిమాలయన్‌ మాస్టర్స్‌' అనే ప్రముఖ ఆధ్యాత్మిక పుస్తకాన్ని బహుమతిగా అందించారు.

Read Also : Spider-man brand new day: స్పైడర్ మ్యాన్ క్రేజీ కలెక్షన్లు

Raashi Khanna: పుస్తకం ఇచ్చి.. ప్రశ్నలు అడుగుతానంటూ రజనీ సరదా వ్యాఖ్యలు

ఈ విషయాలన్నింటినీ రాశీ ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో రూపంలో వెల్లడించారు. షూటింగ్ గ్యాప్‌లో ఆధ్యాత్మికతపై మాట్లాడుకుంటున్న సమయంలో ఈ పుస్తకం చదివావా అని రజనీకాంత్‌ నన్ను అడిగారు. తాను 'లేదని' చెప్పిన కేవలం రెండు రోజులకే స్వయంగా ఆ పుస్తకాన్ని సెట్స్‌కు తీసుకొచ్చి తనకు బహుమతిగా ఇచ్చారని తెలిపారు. అంతేకాకుండా "ఈ పుస్తకం చదవడం పూర్తి చేసిన తర్వాత నిన్ను కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను" అని రజనీకాంత్ తనతో సరదాగా అన్నట్లు రాశీ గుర్తుచేసుకున్నారు.

ఆలోచింపజేస్తున్న ఆధ్యాత్మిక పాఠాలు

గత కొన్ని వారాలుగా ఆ పుస్తకాన్ని ఎంతో ఆసక్తిగా చదువుతున్నానని రాశీ ఖన్నా తెలిపారు. అందులోని కొన్ని పేజీలు చదివిన ప్రతిసారీ తనను ఎంతో ఆలోచనలో పడేస్తున్నాయని చెప్పారు. "ప్రస్తుత సమాజంలో మనలో చాలామంది తమ అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోయి, సమాజం కోసం వేరొకరిగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల మన అంతర్గత ప్రశాంతతకు దూరమవుతున్నాం" అనే భావన ఈ పుస్తకం చదివాక తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని వివరించారు.

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్‌' చిత్రంపై తమిళంతో పాటు దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమా కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైనప్‌లలో ఒకటిగా నిలిచింది.

సినిమాల్లోకి బాలకృష్ణ కూతురు?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha