Varalakshmi Vratam: పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, మహిళామణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
Read Also: YS Jagan: నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నా వైఎస్ జగన్
CM Chandrababu extends Varalakshmi Vratam greetings to the women of the state.
సుభిక్షమైన ఆంధ్రప్రదేశ్ కోసం ఆకాంక్ష
సిరిసంపదలు, సౌభాగ్యానికి అధిదేవత అయిన ఆ వరలక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాడిపంటలతో, సుఖసంతోషాలతో, లక్ష్మీదేవి కటాక్షంతో సుభిక్షంగా, సమృద్ధిగా ముందుకు సాగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కుటుంబ సంక్షేమం, సౌభాగ్యం కోసం నిరంతరం శ్రమించే మహిళలందరికీ ఈ పవిత్ర పండుగ విశేషమైన శుభాలను, శాంతిసంతోషాలను ప్రసాదించాలని ఆశిస్తున్నట్లు తన పోస్టులో పంచుకున్నారు. సీఎం సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ శోభ మరింత సంతరించుకుంది.
Epaper: epaper.vaartha.com

