YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటనను ఖరారు చేసుకున్నారు.
Read Also: Pawan Kalyan : కేరళం వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
YS Jagan to tour Hyderabad today.
YS Jagan: పర్యటన వివరాలు
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బేగంపేట్ నుంచి జలవిహార్‌లోని గ్రాండ్ లాన్స్‌కు చేరుకుని, ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.
వివాహ వేడుక అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి బెంగళూరుకు బయలుదేరనున్నారు. మాజీ సీఎంతో పాటు పలువురు వీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లోని జలవిహార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Epaper: epaper.vaartha.com

