Dailyhunt
రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది

రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది

వార్త 3 weeks ago

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

శనివారం రాణిగంజ్‌లో నిర్వహించిన భారీ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొని బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Read Also: Tamil Nadu Assembly Elections 2026:డీఎంకే సీట్ల సర్దుబాటు పూర్తి.. కాంగ్రెస్‌కు 28 స్థానాలు!

ముర్షీదాబాద్ ఘర్షణలపై ఆగ్రహం

ముర్షీదాబాద్‌లోని రఘునాథ్‌గంజ్‌లో శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలను మమత తీవ్రంగా ఖండించారు. “బెంగాల్‌ను నాశనం చేయాలని చూస్తే, దేశంలో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయం” అని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

బుల్డోజర్ల పాలన వద్దు

బెంగాల్‌లో బీజేపీ పొరపాటున అధికారంలోకి వస్తే ‘బుల్డోజర్ల పాలన’ మొదలవుతుందని మమత ప్రజలను హెచ్చరించారు. “యూపీ తరహాలో ఇక్కడ కూడా బుల్డోజర్లను ప్రయోగించి ప్రజలను ఇళ్ల నుంచి బయటకు గెంటేస్తారు. అటువంటి సంస్కృతి బెంగాల్‌కు వద్దు” అని ఆమె పిలుపునిచ్చారు.

 BJP vs TMC

Mamata Banerjee: ఓటర్ల జాబితా సవరణ (SIR)పై అనుమానాలు

ఎన్నికల్లో గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుని, బీజేపీ నాయకులు అన్ని హద్దులను దాటుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ చెప్పినట్టే ఎన్నికల కమిషన్ నడుస్తోందని, ఎన్నికలకు ముందు బెంగాల్‌లో హడావిడిగా 'ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌)' ప్రక్రియ చేపట్టిందని ఆమె ఆరోపించారు.బెంగాలీ ఓటర్లను తొలగించడానికి ఈసీని బీజేపీ పావులా వాడుకుంటోందని టీఎంసీ అధినేత్రి దుయ్యబట్టారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ వచ్చే నెల 23, 29 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించి, మే 4న ఫలితాలను వెల్లడిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వాహనాదారులకు బిగ్ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha