Telangana Weather Alert: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Read Also : No Bag Day : తెలంగాణ లోని విద్యార్థులకు రిలీఫ్.. స్కూళ్లలో 'నో బ్యాగ్ డే'
Monsoon intensifies in the state; ‘Yellow Alert’ for those districts.
Telangana Weather Alert: ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఇక హైదరాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పలు చోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

