Dailyhunt
రాష్ట్రంలో తాగునీటి కష్టాలు.. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

రాష్ట్రంలో తాగునీటి కష్టాలు.. ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు

వార్త 1 week ago

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.

‘మార్పు కావాలి’ అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేకపోతోందని ఆయన విమర్శించారు. పల్లె నుంచి పట్నం దాకా ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారని ట్విట్టర్ (X) వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు సరఫరా చేశామని హరీష్ రావు గుర్తు చేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని, కేసీఆర్ పై ఉన్న కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. “పథకాలు ఉన్నాయి కానీ ఫలితం లేదు.. పైపులు ఉన్నాయి కానీ నీళ్లు రావు” అంటూ ప్రస్తుత పరిస్థితిని ఎద్దేవా చేశారు.

Read Also: MLA Sanjeeva Reddy: ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: దళారులను నమ్మి మోసపోవద్దు

 Water woes brought again: Harish Rao fires at Revanth government!

Harish Rao: దర్శనమిస్తున్న ట్యాంకర్లు, బిందెలు

మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయని హరీష్ రావు అన్నారు. వీధుల్లో నీటి ట్యాంకర్లు, ఖాళీ బిందెలు, డ్రమ్ములు దర్శనమివ్వడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కేవలం అబద్ధపు ప్రచారాలతో కాలం వెళ్లదీయకుండా, మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు పారించి ప్రజల కన్నీటి బాధలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రజలపై కనీస ప్రేమ లేని ప్రభుత్వంలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని హరీష్ రావు కోరారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మే చివరి నాటికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha