Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి!

ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి!

వార్త 1 month ago

MLA Sanjeeva Reddy: రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యానికి మద్దతు ధర పొందాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపేటలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.

Read Also:May Day 2026: కౌడిపల్లి లో ఘనంగా మే డే సంబరాలు

MLA Sanjeeva Reddy: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలినులు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యే సంజీవరెడ్డి కొప్పోలు ఉమా సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచమ్మ, నాయకులు రాయిని మధుసూదన్, నారా గౌడ్ , దాచ సంగమేశ్వర్, రాజేందర్ గౌడ్, సుభాష్, సర్పంచుల పోరం అధ్యక్షులు పెరుమాల్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బాలల పరిరక్షణ కమిటీలను బలోపేతం చేయాలి: మండల ప్రత్యేక అధికారి జగదీష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha