Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాత్రికి రాత్రే పోలింగ్ ఎలా పెరిగింది - జగన్

రాత్రికి రాత్రే పోలింగ్ ఎలా పెరిగింది - జగన్

వార్త 2 weeks ago

Polling : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. విశాఖపట్నం, చీమకుర్తి, అద్దంకి వంటి ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల నిర్వహణలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తీరును ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 9,19,367 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారని, అయితే ఆ తర్వాతి రోజు ఈ సంఖ్య 10,35,154కు ఎలా చేరిందని జగన్ ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల సంఖ్యలో ఇంత భారీ మార్పు ఎలా చోటుచేసుకుందని నిలదీశారు. ఈ గణాంకాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేయలేదని ఆరోపణ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలంటూ డిమాండ్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై జగన్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖపట్నంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేయలేదని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ బాక్సుల భద్రత అత్యంత కీలకమని, అలాంటి సమయంలో భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. పోలింగ్ గణాంకాల్లో వచ్చిన మార్పులు, స్ట్రాంగ్ రూమ్ భద్రతపై వచ్చిన సందేహాలన్నింటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. మరోవైపు, ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ మున్సిపల్ ఎన్నికల వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది.

నక్కపల్లిలో ఓటు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha