Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నక్కపల్లిలో ఓటు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

నక్కపల్లిలో ఓటు వేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

వార్త 2 weeks ago

Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరిషత్ ఎన్నికల్లో తన పౌర బాధ్యతను నెరవేర్చారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

MPTC ZPTC Elections: పులివెందులలో ఉద్రిక్తత.. పోలింగ్ బూత్ వద్ద పెట్రోల్ బాంబుల దాడి

 Home Minister Vangalapudi Anitha casts her vote in Nakkapalli

Vangalapudi Anitha: విఐపి ప్రోటోకాల్ పక్కనపెట్టి.. క్యూలైన్‌లో సామాన్యురాలిగా!

మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు కోరకుండా, ఒక సామాన్య పౌరురాలిగా తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి క్యూలైన్‌లో నిలబడటం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. తన వంతు వచ్చేవరకు ప్రశాంతంగా అందరితో పాటు వేచి ఉండి ఆమె ఓటు వేశారు. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అనిత పరిధిలోకి నక్కపల్లి మండలం వస్తుంది.

ఓటు హక్కుపై ప్రజలకు పిలుపు

ఓటు వేసిన అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. “ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది. పౌరులంతా తమ బాధ్యతగా ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి” అని ఆమె పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Epaper: epaper.vaartha.com

ఏపీ పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న బోయపాటి శ్రీను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha