Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రావణ్ కేసులో కొత్త ట్విస్ట్.. రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిపివేత

రావణ్ కేసులో కొత్త ట్విస్ట్.. రెండు బ్యాంకు ఖాతాల లావాదేవీలు నిలిపివేత

వార్త 1 month ago

Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర, విద్వేషపూరిత వీడియోలు రూపొందిస్తున్నారనే ఆరోపణలపై వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ 'ప్రశ్న' రావణ్‌పై ఏపీ పోలీసులు చర్యలను మరింత ఉధృతం చేశారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు తాజాగా ఫ్రీజ్ చేశారు.

విద్వేష కంటెంట్‌తో నెలకు రూ.1.5 లక్షల సంపాదన

యూట్యూబ్‌లో ‘ప్రశ్న’ అనే ఛానల్/మాధ్యమం ద్వారా సమాజంలో విద్వేషాన్ని, పరస్పర దూషణలను రెచ్చగొట్టేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తూ రావణ్ నెలకు రూ.1.50 లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వివాదాస్పద కంటెంట్ ద్వారానే ఆయనకు పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రావణ్‌కు ఖాతాలు ఉన్న ఐసీఐసీఐ (ICICI), యస్ బ్యాంక్ (Yes Bank) యాజమాన్యాలకు పోలీసులు అధికారికంగా లేఖలు రాయడంతో, ఆయా బ్యాంకులు ఆ అకౌంట్లను తక్షణమే నిలిపివేశాయి.

Prashna Ravan: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్.. డిలీట్ చేసిన డేటాపై ఆరా!

ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగినట్లు అందిన పలు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జులై 2వ తేదీన రావణ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను నిపుణులు ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) విశ్లేషణకు పంపారు. అరెస్ట్‌కు ముందే ఫోన్‌లోని కీలక డేటాను రావణ్ డిలీట్ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు, ఫోరెన్సిక్ సాయంతో ఆ వీడియోలను, వాట్సాప్ చాటింగ్‌లను, ఇతర సమాచారాన్ని తిరిగి రికవరీ చేసే పనిలో పడ్డారు.

రావణ్ వెనుక ఉండి ఇలాంటి విద్వేషపూరిత ప్రచారాలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఫండింగ్ చేస్తున్న వారు ఎవరు? అనే కోణంలో కూడా పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

రావణ్ అరెస్ట్ వివాదంపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha