Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాయదుర్గంలో భూమి ధరల సంచలనం.. ఎకరం రూ.237 కోట్ల రికార్డు

రాయదుర్గంలో భూమి ధరల సంచలనం.. ఎకరం రూ.237 కోట్ల రికార్డు

వార్త 2 months ago

Hyderabad Real Estate : హైదరాబాద్‌లో భూముల ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఐటీ కారిడార్‌గా గుర్తింపు పొందిన రాయదుర్గంలో జరిగిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడై రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించింది.

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ వేలంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు పోటీ పడగా, రికార్డు స్థాయి ధర నమోదైంది.

6.29 ఎకరాల భూమికి భారీ బిడ్

రాయదుర్గంలోని 6.29 ఎకరాల భూమికి నిర్వహించిన వేలంలో గౌరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యధిక ధరను కోట్ చేసి స్థలాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఎకరానికి కనీస ధరను రూ.139 కోట్లుగా నిర్ణయించగా, బిడ్డింగ్‌లో అది రూ.237 కోట్లకు చేరుకుంది. దీంతో కేవలం ఈ భూమి విక్రయం ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ.1490 కోట్ల ఆదాయం లభించింది. గతంలో ఇదే ప్రాంతంలో నమోదైన రూ.177 కోట్ల రికార్డును ఈ వేలం అధిగమించింది.

Read also: AP Noise Pollution: ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!

 Hyderabad Real Estate

ఐటీ హబ్‌గా రాయదుర్గం ఆకర్షణ

రాయదుర్గం ప్రాంతం ప్రస్తుతం ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు, స్టార్టప్ కేంద్రాలకు నిలయంగా మారింది. టీ-హబ్, టీ-వర్క్స్ వంటి ప్రముఖ ఆవిష్కరణ కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న సులభ అనుసంధానం ఈ ప్రాంత విలువను మరింత పెంచింది. ఇదే కారణంగా జాతీయ స్థాయి డెవలపర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ఈ ఏడాది చివరికి మూడు పోర్టులు ప్రారంభం.. మంతెన రామరాజు సంచలన ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha