Medak News: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని రైలాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు అంగన్వాడి కేంద్రంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకి తో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Medak News: ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలతో వాళ్లు నేర్చుకున్న కృత్యాలను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అసెస్మెంట్ కార్డు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ తోపాటు సూపర్వైజర్ సుజాత, గ్రామ సర్పంచ్ స్వప్న షేకులు, ఉపసర్పంచ్ సంతు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, కవిత, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

