Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా భారీ మౌన ప్రదర్శన!

శంకర్ గౌడ్ మృతికి సంతాపంగా భారీ మౌన ప్రదర్శన!

వార్త 2 months ago

RTC Strike Protest: మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సాగుతున్న ఈ పోరాటం జిల్లావ్యాప్తంగా ఉధృత రూపం దాల్చుతోంది.

ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ వద్ద ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ మృతి పట్ల స్థానిక కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనను వ్యక్తం చేశారు. ​మెదక్ బస్టాండ్ వద్ద శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్మికులు ఘనంగా నివాళులర్పించారు.

Read Also :RTC Strike: పోలీసుల కాళ్లు పట్టుకున్న ఆర్టీసీ కార్మికులు.. శంకర్ గౌడ్ నివాళికి నిరాకరణ!

 RTC Strike Protest: Massive silent protest to mourn the death of Shankar Goud!

అనంతరం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మెదక్ గుల్షన్ క్లబ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు. తమ సహోద్యోగి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా కార్మికులు నినదించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రాజకీయ పార్టీలు మరియు వివిధ ప్రజా సంఘాల నుండి భారీ మద్దతు లభించింది. బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, సీఐటీయూ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.

శంకర్ గౌడ్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం అణచివేయాలని చూడటం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండివైఖరిని వీడి, కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు.. సచివాలయంలో IAS కమిటీతో JAC నేతల చర్చలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha