Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చట్టం ఎవరికీ చుట్టం కాదు: బండి సంజయ్ భావోద్వేగం

చట్టం ఎవరికీ చుట్టం కాదు: బండి సంజయ్ భావోద్వేగం

వార్త 1 week ago

Bandi Bhagirath POCSO Case: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై, స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

రాజకీయాల్లో ఎంతటి వారికైనా చట్టం ఒకటేనని, న్యాయం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు.

Read Also:Husnabad Co-option Members Election: నేడే హుస్నాబాద్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక?

 Bandi Sanjay, Bandi Bhagirath

కుమారుడిపై కేసు నమోదు కావడంపై బండి సంజయ్ మాట్లాడుతూ.. “చట్టం అందరికీ సమానమే. తప్పు చేసిన వారు ఎవరైనా, అది నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే” అని కుండబద్దలు కొట్టారు. తాను ఎప్పుడూ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని, కోర్టు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అయితే, కావాలనే తన కుమారుడిని క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కొడుకుకు సమయం ఇవ్వలేకపోయాను

ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. “నా జీవిత కాలమంతా సమాజానికే అంకితం చేశాను. ఆ క్రమంలో నా కొడుకు కోసం సమయం కేటాయించలేకపోయాను” అని వాపోయారు. తన కొడుకు తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడని, అయినప్పటికీ తాను అతడిని గుడ్డిగా సమర్థించడం లేదని, విచారణలో నిజానిజాలు తేలాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Bandi Bhagirath POCSO Case: కన్నపేగు తల్లడిల్లుతోంది..

రాజకీయ దాడులు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని, కానీ తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. “ఇవాళ నా కొడుకుపై జరుగుతున్న ప్రచారాన్ని చూసి కన్నపేగు తల్లడిల్లుతోంది” అంటూ ఎమోషనల్ అయ్యారు. తన భార్య కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ తనను అనుసరిస్తోందని, ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా నిలబడతామని చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పుల్కల్ మండలంలో అక్రమ మట్టి దందా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha