Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు మెమో రైళ్లు రద్దు

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఏపీలో పలు మెమో రైళ్లు రద్దు

వార్త 1 week ago

AP MEMU Trains Cancelled: ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్‌డేట్ ఇచ్చింది. నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది వంతెనపై జరుగుతున్న మరమ్మతుల కారణంగా పలు మెమో (MEMU) రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

గత రెండు రోజులుగా పలు రైళ్లు రద్దు కాగా, గురువారం కూడా ఈ మెమో రైళ్లు రద్దు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Also : Anantapur incident: కొడుకు ఇష్టం లేని పెళ్లితో.. దారుణానికి ఒడిగట్టిన నానమ్మ

 Alert for train passengers: Several MEMU trains cancelled in AP.

AP MEMU Trains Cancelled: స్వర్ణముఖి వంతెనపై గడ్డర్ల మార్పిడి పనులు

నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిపై ఉన్న రైల్వే వంతెన మార్గంలో పాత ఇనుప గడ్డర్ల స్థానంలో నూతన సిమెంట్ గడ్డర్లను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ పనులను వేగవంతం చేసింది. గత పది రోజులుగా ఈ మరమ్మతు పనులు సాగుతుండటంతో ట్రాఫిక్ మళ్లింపులు, రైళ్ల రద్దు తప్పనిసరైంది.

రద్దయిన రైళ్ల వివరాలు ఇవే!

  • సూళ్లూరుపేట - నెల్లూరు: ఉదయం 8:05 గంటలకు, 10:00 గంటలకు బయలుదేరాల్సిన మెమో రైళ్లు రద్దయ్యాయి.
  • నెల్లూరు - సూళ్లూరుపేట: ఉదయం 10:20 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరాల్సిన మెమో రైళ్లు రద్దయ్యాయి.

అయితే, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రద్దయిన మెమో రైళ్లను చెన్నై - సూళ్లూరుపేట మధ్య మాత్రమే నడిచేలా రైల్వేశాఖ తాత్కాలిక మార్పులు చేసింది. ఈ పనుల కారణంతో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ప్రయాణికుల అవస్థలు

రైళ్లు రద్దు కావడంతో పాటు సూళ్లూరుపేట నుండి నెల్లూరు వైపు వెళ్లే పలు ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా కొంతకాలంగా నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు లేక నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

జగన్ వ్యాఖ్యలపై ఎంపీ కలిశెట్టి ఘాటు విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha