Indian Railway New Rules 2026: రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై భారతీయ రైల్వే కఠిన చర్యలకు సిద్ధమైంది. రైల్వే బోర్డు తాజా నిబంధనల ప్రకారం ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని కీలక మార్పులు చేసింది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో సెల్‌ఫోన్లలో గట్టిగా మాట్లాడటం, లౌడ్ స్పీకర్ పెట్టి పాటలు వినడం వంటి పనుల వల్ల ఇతరులు నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also:Layoffs Impact :ఉద్యోగం కోల్పోయిన వారికంటే.. మిగిలి ఉన్నవారే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారా?
రైల్వేలో ‘క్వైట్ అవర్స్’ అమలు
రైల్వే శాఖ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు సమయాన్ని ‘క్వైట్ అవర్స్’ (నిశ్శబ్ద సమయం)గా ప్రకటించింది. ఈ సమయంలో ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో లౌడ్ స్పీకర్ మోడ్‌లో పాటలు వినడం లేదా సినిమాలు చూడటం పూర్తిగా నిషిద్ధం. ఎవరైనా సంగీతం వినాలనుకుంటే ఖచ్చితంగా ఇయర్‌ఫోన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఒకవేళ తోటి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే వాటిని నిలిపివేయాలి.
Indian Railway New Rules 2026: Jail, heavy fine for talking loudly on the train!
Indian Railway New Rules 2026: ఫోన్ కాల్స్‌పై కఠిన నిబంధనలు
కేవలం పాటలే కాకుండా ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి. ఈ నిశ్శబ్ద సమయంలో చాలా తక్కువ స్వరంతో సంభాషించాలని, తోటి ప్రయాణికుల నిద్రకు భంగం కలిగించకూడదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత కంపార్ట్‌మెంట్‌లో నైట్ లాంప్ మినహా మిగిలిన లైట్లన్నీ ఆపివేయడం తప్పనిసరి.
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
ఈ నిబంధనలను అతిక్రమించి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టే వారిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాతో పాటు, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ప్రయాణంలో ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తూ అసౌకర్యం కలిగిస్తే, ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి లేదా హెల్ప్‌లైన్ నంబర్ 139కి ఫిర్యాదు చేయవచ్చు.
తక్షణమే స్పందించే రైల్వే సిబ్బంది
ఫిర్యాదు అందిన వెంటనే రైల్వే సిబ్బంది లేదా ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు వచ్చి తక్షణమే చర్యలు తీసుకుంటారు. రాత్రిపూట గస్తీ కాసే సిబ్బంది కూడా ప్రయాణికులు నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారా లేదా అన్నది పర్యవేక్షిస్తారు. ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసేందుకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

