Indian Railway Tatkal Booking : రైల్వే స్టేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి ప్రయాణికులు పడే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.
నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలోని జోధ్‌పుర్ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా ‘టోకెన్ సిస్టమ్’ను ప్రవేశపెట్టారు.
Read Also: Tamil Nadu: తమిళనాడు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ అరుణ్ బదిలీ
Indian Railway Tatkal Booking
Indian Railway Tatkal Booking :కౌంటర్ల వద్ద టోకెన్ విధానం
నూతన విధానం ప్రకారం ఉదయం 8 గంటల నుండి కౌంటర్ల వద్దకు వచ్చే ప్రయాణికులకు ఒక ప్రత్యేక టోకెన్ కేటాయిస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఆధారంగానే వరుస క్రమంలో బుకింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. దీనివల్ల తోపులాటలు, గందరగోళం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. జోధ్‌పుర్ డివిజన్ పరిధిలో రద్దీని తట్టుకునేందుకు తత్కాల్ బుకింగ్ కౌంటర్ల సంఖ్యను 3 నుండి 6 కి పెంచారు. కౌంటర్ల సంఖ్య రెట్టింపు కావడం వల్ల ప్రయాణికులు వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులకు ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికుల భద్రత, స్టేషన్లలో క్రమశిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టంలో సవరణలు చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు కఠిన జరిమానాలు విధిస్తారు:
- టికెట్ లేకుండా ప్రయాణించడం, వేరేవారి టికెట్‌తో ప్రయాణిస్తే రూ. 500 జరిమానా (చార్జీలతో పాటు).
- అనుమతి లేకుండా తినుబండారాలు అమ్మే వీధుల వ్యాపారులకు, భిక్షాటన చేసే వారికి రూ. 2,000 ఫైన్.
- రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే రూ. 1,000 నుండి రూ. 2,000 జరిమానా.
- రైల్వే ఆవరణలోకి అనధికారికంగా ప్రవేశిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు.
Epaper: epaper.vaartha.com
వ్యవసాయంలో ఆవిష్కరణలు పెంపొందించడంపై శిక్షణ..పాల్గొన్న 24 దేశాల ప్రతినిధులు

