Jobs in the Railways : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ మరో తీపికబురు అందించింది. రైల్వే శాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీకి CEN 07/2026 అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో మొత్తం 1688 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సికింద్రాబాద్ రైల్వే జోన్ పరిధిలో 72 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 13, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (+2 స్టేజ్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, 12వ తరగతి కంటే ఉన్నత విద్యార్హత కలిగిన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం కనీస మార్కుల విషయంలో మినహాయింపులు వర్తించవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

