Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వేలో 3,548 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు..చివరి తేదీ ఇదే

రైల్వేలో 3,548 గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు..చివరి తేదీ ఇదే

వార్త 1 week ago

RRB NTPC Recruitment 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు శుభవార్త. నాన్‌-టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ (NTPC) గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 6, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also :APPSC Jobs 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వివిధ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు

ఏయే పోస్టులు ఉన్నాయి?

ఈ నియామక ప్రక్రియలో నాలుగు రకాల గ్రాడ్యుయేట్‌ స్థాయి పోస్టులు ఉన్నాయి.

  • గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ - 2,750 పోస్టులు
  • సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ - 371 పోస్టులు
  • జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ - 300 పోస్టులు
  • చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ - 127 పోస్టులు

మొత్తం 3,548 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత, వయోపరిమితి

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 1, 2027 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం అర్హులైన వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

RRB NTPC Recruitment 2026: దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే?

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 8, 2026న ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్‌ 6, 2026 రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఫీజు తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

అధికారిక వెబ్‌సైట్‌:rrbapply.gov.in

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో 1.3 లక్షల ఉద్యోగాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha