Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాలు.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు

రైల్వేలో 6,557 టెక్నీషియన్ ఉద్యోగాలు.. నేటి నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు

వార్త 4 days ago

Railway Jobs: రైల్వే రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 6,557 టెక్నీషియన్ (Technician) పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మెగా రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30 (నేడే) నుండి అధికారికంగా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 29 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చు. టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా మరియు ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం.

Read Also:RRB Jobs 2026: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

పోస్టుల వివరాలు మరియు విద్యా అర్హతలు

మొత్తం 6,557 ఖాళీలను రెండు ప్రధాన కేటగిరీలుగా విభజించారు. పోస్టును బట్టి విద్యార్హతల్లో మార్పులు ఉన్నాయి. ఇందులో 323 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ (B.E/B.Tech) లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇందులో అత్యధికంగా 6,234 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 10వ తరగతి (SSC) తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) విద్యార్హత సాధించిన వారు అర్హులు.

    Railway Jobs: వయోపరిమితి మరియు ఎంపిక విధానం

    అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి కింది విధంగా ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది) గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు 18 నుండి 33 సంవత్సరాలు, అలాగే గ్రేడ్-III పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT – Computer Based Test) ద్వారా జరుగుతుంది. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతారు.

    Epaper: epaper.vaartha.com

    వాయిదా పడ్డ ఈఏపీసెట్ ఫలితాలు.. గురువారమే విడుదల?

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha