భారతీయ రైల్వే అటవీ జంతువుల రక్షణ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. అడవుల గుండా వెళ్లే రైల్వే ట్రాక్ (Railway Track) లపై తరచూ జరుగుతున్న జంతు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల భద్రతకు ఎంతో ఉపయోగపడనుంది.
AI 1 Pay: ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

ఐడీఎస్ విజయవంతం
ఈ ఏఐ కెమెరాలు ట్రాక్‌పై జంతువులు ఉంటే లోకో పైలట్‌లకు 0.5 కిలోమీటర్ల దూరంలోనే సమాచారం అందిస్తాయి. ఇటీవల నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్‌లో 141 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 981 కిలోమీటర్ల మేర ఈ కెమెరాలను అమర్చాలని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Narayana: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొత్త చట్టంతో నీరుగార్చేయత్నం

