Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైస్ మిల్లుల్లో కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయి తనిఖీలు!

రైస్ మిల్లుల్లో కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయి తనిఖీలు!

వార్త 1 week ago

Siddipet Paddy Procurement Inspection: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, మిల్లులలో దిగుమతిని మరింత వేగవంతం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.

హైమావతి రైస్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం దిగుమతి అవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

కలెక్టర్ దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామంలోని లలిత పరమేశ్వర ఇండస్ట్రీస్, అక్బర్ పేట-భూంపల్లి మండలం మోతే గ్రామంలోని భారతి ఇండస్ట్రీస్, మంజునాథ ఇండస్ట్రీస్, దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలోని స్వాతి ఇండస్ట్రీస్, మరియు రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలోని శివ సాయి బాలాజీ ఇండస్ట్రీస్‌లను తనిఖీ చేశారు.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

షిఫ్ట్‌ల వారీగా హమాలీల ఏర్పాటు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుండి లారీలు, ట్రాక్టర్లలో మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని వెనువెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. దిగుమతిలో జాప్యం జరగకుండా ఉండేందుకు ఎక్కువ మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, అవసరమైతే షిఫ్ట్‌ల వారీగా వారితో పనిచేయించాలని మిల్లర్ల యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే, గ్రామాల్లో స్థానికంగా ఉండే హమాలీలను సమకూర్చుకుని కొనుగోలు కేంద్రాల్లోనే తూకాలు వేస్తే మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ మరింత సులువవుతుందని రైతులకు సూచించారు.

ఆన్‌లైన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలి

ధాన్యం దిగుమతి కాగానే మిల్లర్ అక్నాలెడ్జ్‌మెంట్, ట్రక్ షీట్ జనరేషన్, మరియు ఓపీఎంఎస్ (OPMS) అప్‌లోడ్ వంటి ప్రక్రియలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిల్లుల వద్ద లారీల దిగుమతి ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ అధికారులను నియమించినట్లు ఆమె వెల్లడించారు.

Siddipet Paddy Procurement Inspection: వచ్చే ఖరీఫ్‌లో సన్న వడ్ల సాగుపై దృష్టి

రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్‌లో సన్న వడ్లను పండించేలా మొగ్గు చూపాలని కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. సన్న వడ్లకు ప్రభుత్వం అందించే బోనస్‌తో పాటు, మన జిల్లాలో పండే సన్న బియ్యం ఇక్కడి ప్రజల అవసరాలకు సరిపోతాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు సన్న బియ్యం కొరత ఉండటం వల్ల ఇతర జిల్లాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా సివిల్ సప్లైస్ అధికారి (DSO) తనూజతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha