Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, వంట నూనెలు

రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కందిపప్పు, వంట నూనెలు

వార్త 2 weeks ago

Andhra Pradesh : అధిక ధరలతో బాధపడుతున్న పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. రాష్ట్రంలో ఇప్పటికే సబ్సిడీపై సన్న బియ్యాన్ని అందిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైతు బజార్ల ద్వారా కందిపప్పు, వంట నూనెలు తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే పేదలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్న మనోహర్.. తమ ప్రభుత్వం, ఇప్పుడు మరిన్ని నిత్యవసర వస్తువులను కూడా మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు దీంతో ప్రభుత్వం దానిపై సమీక్ష నిర్వహించింది. తక్కువ ధరకే క్వాలిటీ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి నేపథ్యంలో తక్కువ ధరకే సన్న బియ్యం అందుబాటులోకి తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Aqua Zone : నాన్ ఆక్వా జోన్లో సాగు చేస్తున్న రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

 Andhra Pradesh

Andhra Pradesh : రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్ లెట్ల ద్వారా ఈ సేవలు

బిపిటి స్టీమ్డ్ రైస్ 52 రూపాయలకు, బిపిటి రా బియ్యం కిలో 50 రూపాయలకు ప్రజలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్ లెట్ల ద్వారా ఈ సేవలు కొనసాగుతున్నాయని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే కందిపప్పు, పామాయిల్ వంటి వాటిని కూడా తక్కువ ధరకు పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ధరల స్థిరీకరణ పైన నిరంతరం దృష్టి సారిస్తున్న ప్రభుత్వం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటుందని వివరించారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha