Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు నేత సారంపల్లి మృతి.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

రైతు నేత సారంపల్లి మృతి.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

వార్త 3 weeks ago

KCR: అఖిలభారత రైతు సంఘం (AIKS) నేత, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రైతాంగ సమస్యల కోసం జీవితాంతం పోరాటం

సారంపల్లి మల్లారెడ్డి తన జీవితకాలమంతా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎంతో నిబద్ధతతో శ్రమించారని కేసీఆర్ కొనియాడారు. ఆయన ఒక గొప్ప రైతు ఉద్యమ నాయకుడిగా సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

KCR: భారత రైతాంగ పోరాటాలకు తీరని లోటు

మల్లారెడ్డి అకాల మరణం కేవలం కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే కాకుండా, సమస్త భారత రైతాంగ పోరాటాలకు తీరని లోటని కేసీఆర్ అభివర్ణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

Epaper: epaper.vaartha.com

బీజేపీ నేతల ప్రచారమంతా అవాస్తవమే: రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha