Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు.. మంత్రి తుమ్మల

రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు.. మంత్రి తుమ్మల

వార్త 3 months ago

Telangana Agriculture: రైతు సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పి)లు ప్రకటించడం కాదని, ఆ ధరకు కొనుగోలు చేయడమే అసలు రైతు సంక్షేమమని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రతి పంటలో కనీసం 75 శాతం దిగుబడిని కేంద్రమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. మొక్కజొన్న, జొన్నలను వెంటనే పంటల మద్దతు ధరల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Read Also: Formula e Car Race : KTRకు సమన్లు

 The Centre has no intention of increasing farmers’ income: Minister Tummala

Telangana Agriculture: రాష్ట్రంపై రూ. 4000 కోట్ల అదనపు భారం

రైతుల శ్రేయస్సు కోసం మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. కేంద్రం చేతులెత్తేయడంతో పంట కొనుగోళ్లతో ఏటా రూ. 4000 కోట్ల భారం రాష్ట్రంపై పడుతోందన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల ఆశలను పూర్తిగా నీరుగార్చాయని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ స్పష్టంగా సూచించినట్లుగా సంపూర్ణ ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం కలిపి ఎంఎస్పి నిర్ణయించాలన్నారు. ఈ మూల సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తుంగలో తొక్కిందని మంత్రి తుమ్మల మండిపడ్డారు.

నామమాత్రపు పెంపుతో రైతులకు వంచన

రైతుల కోసం మద్దతు ధరలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, ఆచరణలో మాత్రం రైతులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. సాధారణ వరి ఎంఎస్ పిని క్వింటాల్కు రూ.2,441గా నిర్ణయించడం ద్వారా గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.72 మాత్రమే పెంచారని, ఇది కేవలం 3 శాతం పెరుగుదల మాత్రమేనని, ఎరువులు, కార్మిక చార్జీలు, విత్తనాలు, డీజిల్, విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగిన పరిస్థితుల్లో ఈ పెంపు రైతులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని స్పష్టం చేశారు. ఇక మొక్కజొన్న మద్దతు ధరనును క్వింటాల్కు రూ.2,410గా నిర్ణయించి కేవలం 5.10 మాత్రమే పెంచారని తీవ్రంగా విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రధాని బాటలో రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ వాహనాలు భారీగా తగ్గింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha