Rythu Bharosa: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. తాజాగా ఆరో విడత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
7 ఎకరాల లోపు సాగు భూమి ఉన్న లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులను జమ చేసింది. 92,729 మంది అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.354.96 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో నేరుగా జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే వరకు రైతు భరోసా కింద రాష్ట్రవ్యాప్తంగా 68.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,490.72 కోట్లు జమైనట్లుగా అధికారులు ప్రకటించారు.
Read Also: Telangana government: సన్న వడ్ల బోనస్ కొత్త నిబంధనలు ఇవే!
Rythu Bharosa
Rythu Bharosa: ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతుకు జమ
శనివారం ఐదో విడత రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. ఐదో విడతలో భాగంగా 5 నుంచి 6 ఎకరాల లోపు ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేశారు. ఐదో విడతలో 1.69 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. శుక్రవారం నాల్గో దఫా రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 4.41 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1188 కోట్లు జమ చేశారు. మూడో విడతలో భాగంగా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రూ.1,330 కోట్లను జమ చేశారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు వివరించారు. జూన్ 30 తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మంత్రులు నిధులు విడుదల చేశారు.
Epaper: epaper.vaartha.com
Read Also:

