Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు 7 శాతం వడ్డీతో పంట రుణాలు!

రైతులకు 7 శాతం వడ్డీతో పంట రుణాలు!

వార్త 2 months ago

Nellore DCCB Loans: వ్యవసాయ భూమి కొనుగోలు కోసం రూ. 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తున్నట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు.

మెట్టుకూరు ధనుంజయ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నెల్లూరులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ.. మహాజన సభ సమావేశాలు జరిగాయి. సమావేశాలను ఉద్దేశించి బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ 1918లో కార్యకలాపాలను ప్రారంభించిన నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ 108 సంవత్సరాలుగా రైతులకు.. ఇతరులకు సేవలందిస్తుందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 23 బ్రాంచ్ లను…82 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంక్ లావాదేవీలు ఈ ఏడాది మార్చి 31కి రూ. 2733.67 కోట్లుగా పేర్కొన్న ఆయన రూ. 568.98 కోట్ల రూపాయలు డిపాజిట్లు కలిగి ఉన్నామన్నారు.

Read Also : తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

లాభాలబాటల…

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లాభాల బాటలో ఉందని పేర్కొన్న మెట్టుకూరు ధనుంజయ రెడ్డి 2025-26 సంవత్సరం మార్చినాటికి రూ. 8.92 కోట్ల రూపాయలు లాభాలు అర్జించామన్నారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఇవ్వడం జరుగుతుందన్న ఆయన రూ. 15 లక్షలు అంతకన్నా ఎక్కువ డిపాజిట్లపై అదనంగా వడ్డీ కూడా అందిస్తున్నామన్నారు. ఏడాది బ్యాంక్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తక్కువ వడ్డీ రేటును రుణ గ్రహీతలకు అంటే 7 శాతం వడ్డీతో పంట రుణాలను అందజేస్తున్నామన్నారు.

భూముల కొనుగోలుకై రుణాలు

ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వ్యవసాయ భూమి కొనుగోలు కోసం రుణాలు మంజూరు చేస్తున్నామన్న బ్యాంకు చైర్మన్ ఇందుకోసం వసుంధర అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఈ పలక క్రింద చిన్న కారు రైతులు వ్యవసాయ భూమి కొనుగోలు కోసం రూ. 20 లక్షల రూపాయల వరకు రుణాలు పొందవచ్చన్నారు. అలాగే వ్యవసాయ పరిశ్రమకు వ్యక్తులకు వారి సొంత సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకై బ్యాంక్ అగ్రి క్లినిక్స్.. అగ్రి బిజినెస్ సెంటర్స్ అని కొత్త రుణ పథకాలను కూడా ప్రవేశపెట్టామన్నారు. ఇక బంగారు ఆభరణాలను తాకట్టులో పెట్టుకొని విరివిగా రుణాలు ఇస్తున్నామన్న ఆయన ఆ విధంగా ఇప్పటికే రూ. 773.96 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చామన్నారు. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని.. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గ్రాముకు కు రూ. 9500 రూపాయల వరకు రుణాలు ఇస్తున్నట్టు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలు ఏర్పాటుకు… గృహ నిర్మాణాలు కొనుగోలుకు రుణాలు అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సొసైటీల ద్వారా కేసిసి విధానంలో స్వల్ప కాలిక రుణాలు తీసుకున్న రైతులకు ఏదైనా ప్రమాదం జరిగితే అతి తక్కువ ప్రీమియం రూ. 19.90 రూపాయలతో రెండు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి.. సిహెచ్ పథకాల క్రింద వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తున్న ఆయన అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కష్టం హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు రుణాలు అందజేస్తుమన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 650 రైతు భరోసా కేంద్రాలలో 552 కేంద్రాలకు గాను 460 కష్టం హైరింగ్ సెంటర్ల గ్రూపులకు రూ. 20.67 కోట్లు రుణాలుగా అందజేశామన్నారు. రుణాల వసూళ్ల లోనూ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ముందంజలో ఉందన్న ఆయన ఏడాది మార్చి నాటికి రుణాల వసూలు శాతం 92.16 శాతంగా ఉందన్నారు.

Nellore DCCB Loans: 11 సొసైటీలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సహకారంతో జిల్లాలోని 11 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొన్న మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఇందులో భాగంగా మొదటి విడతలో సంగం ..మారెమ్మ రెడ్డిపాలెం..పడుగుపాడులలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామన్న ఆయన పొదలకూరు.. చిల్లకూరు.. వెంకటగిరి లలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయన్నారు. ఇక జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 23 బ్రాంచ్ లు ఉండగా త్వరలోనే కొత్తగా కొత్తూరు…కాకుపల్లి..ఇందుకూరుపేట.. డక్కిలిలలో బ్యాంక్ లు ఏర్పాటువి చేయనున్నట్టు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గోడౌన్లకు మౌలిక సదుపాయాలు

సమావేశంలో పాల్గొన్న జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో ఉన్న 69 గోడౌన్లకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు. గోడౌన్ల వద్ద అప్రోచ్ రోడ్లు డ్వామా నిధులతో.. విద్యుత్ సౌకర్యం.. తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు జడ్పీ నిధులతో చేసేలా జిల్లా కలెక్టర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారన్నారు. కాగా బ్యాంకింగ్ ఆర్థిక రంగాలలో విశేష అనుభవం కలిగిన కెఎన్ఎన్వి. సుబ్బారావు.. డీవీ. ప్రభాకర్ రావు లను బ్యాంక్ ప్రొఫెషనల్ డైరెక్టర్లుగా నియమించారు. కాగా ఈ సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు…బ్యాంక్ సీఈవో శ్రీనివాసరావు.. నాబార్డ్ డీడీఎం బాబు.. ఆప్కాబ్ డిజిఎం సురేంద్రబాబు.. ఎన్డీసీసీబీ జనరల్ మేనేజర్ సరిత.. డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఉషారాణి.. దయాకర్ రెడ్డి.. నాగేంద్రకుమారి తదితరులతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని సొసైటీల చైర్మన్లు.. సీఈవోలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

లింగమనేని రమేశ్ కు రాజ్యసభ సీట్ ఇవ్వడంపై జనసైనికుల అసంతృప్తి !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha