Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచే కాలువల్లోకి సాగునీరు విడుదల!

రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచే కాలువల్లోకి సాగునీరు విడుదల!

వార్త 5 days ago

పూడిక తొలగింపు నెలాఖరులోగా పూర్తి కావాలి. అధికారులతో సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల

Atchannaidu: జూన్ 1 నుంచి కాలువల్లోకి సాగునీరు విడుదల చేస్తామని వ్యవసాయ, జల నీటివనరుల శాఖా మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ప్రకటించారు.

ఖరీఫ్ 2026 సాగునీటి విడుదలపై మంత్రులు సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కాలువల్లో పూడిక తొలగింపు పనులను మే చివరికి పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. గత సీజన్లో 2025-26 ఖరీఫ్ 99.35 లక్షల ఎకరాలకు 888 టీఎంసీల నీటి సరఫరా చేశామని, రబీ సీజన్లో 23.67లక్షల ఎకరాలకు 153 టీఎంసీల నీరు అందించామని మంత్రులు తెలిపారు. రాష్ట్ర రిజర్వాయర్లలో 461 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు.

Read also: Undavalli Farmers Protest: అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై ఉండవల్లి రైతుల తిరుగుబాటు

 ap kharif 2026 canal water release

ఇరు శాఖల ఉన్నతాధికారులతో సుధీర్ఘ చర్చ అనంతరం ఆయా ప్రాజెక్టుల కింద ఉన్న ఆయ కట్టుకు నీటి విడుదలపై షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇందులో పెన్నా డెల్టాకి ఇప్పటికే మే4వ తేదీ నుండి సాగునీటిని విడుదల చేశామని, గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీ నుండి, గాలేరునగరి సుజల స్రవంతి (జిఎన్ఎస్ఎస్) కింద ఉన్న ఆయకట్టుకు జూన్10వ తేదీనుండి, టిజిపి కడప (ఎస్పీవీబీఆర్ కడప)కు జూన్15 నుండి సాగునీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని వంశధార ఆయకట్టుకు జూన్15వ తేదీ నుండి, తోటపల్లి ఆయకట్టుకు జూలై1 నుండి, కృష్ణా డెల్టా ఆయకట్టుకు జూలై1వ తేదీ నుండి, ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు జూలై10 నుండి, కేసి కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బసి, టిబిపిఎల్ ఎల్సి, తాడిపూడి, పుష్కర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టుకు జూలై15 నుండి, టిబిపిహెచ్ఎల్సి కింద ఉన్న ఆయకట్టుకు జూలై 20 నుండి, హంద్రీనీవా సుజలస్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ఆయకట్టుకు జూలై31 నుండి, నాగార్జున సాగర్ ఆయకట్టు కింద జోన్1 (పల్నాడు, గుంటూరు, బాపట్ల)కు జూలై 31న, జోన్2 (ప్రకాశం, మార్కాపురం) ఆయకట్టుకు ఆగష్టు చివరి వారంలో సాగునీటి విడుదల చేయనున్నట్లు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఎన్సీ నరసింహమూర్తి, మరియు ఇరు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Atchannaidu: డెల్టా ప్రాంతాలకు నీటి విడుదల షెడ్యూల్

గోదావరి డెల్టాకు జూన్ 1 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు. కృష్ణా డెల్టాకు జూలై 1 నుంచి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు జూలై చివరికి, కె.సి. కెనాల్ కు జూలై 15 నుంచి, వంశధార ఆయకట్టుకు జూన్ 15 నుంచి సాగునీరు విడుదల చేస్తామని తెలిపారు.

అధికారులకు హెచ్చరికలు

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఖరీఫ్ 2026 ప్రణాళికలు, ఎల్నినో ప్రభావంపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. యూరియా సరఫరా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు అందజేస్తామని, అవసరం మేరకు ఆ కార్డు ద్వారా యూరియా తీసుకోవచ్చని తెలిపారు. ముందస్తు నిల్వలు వద్దని, రెండుమూడు దశల్లో నానో యూరియా వినియోగించాలని సూచించారు. యుద్ధం కారణంగా యూరియా దిగుమతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల యూరియాను అవసరం మేరకు మాత్రమే వాడాలని రైతులకు అచ్చెన్నాయుడు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha