Urea Booking: తెలంగాణలోని రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 'FFS' (ఫెర్టిలైజర్ ఫార్మర్ సర్వీస్) పేరుతో ఒక నూతన మొబైల్ యాప్‌ను ప్రభుత్వం అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ డిజిటల్ సేవ ద్వారా అన్నదాతలు ఇకపై దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా తమ ఇంటి నుంచే మొబైల్ ద్వారా యూరియా, డీఏపీ (DAP) తదితర ఎరువులను ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.

పాస్‌బుక్ లేకున్నా ఆధార్‌తో ఎరువుల బుకింగ్
సాధారణంగా వ్యవసాయ సంబంధిత సేవలకు పట్టాదారు పాస్‌బుక్ ఉండటం తప్పనిసరి. అయితే ఈ యాప్‌లో ఆ నిబంధనను సడలిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ పట్టాదారు పాస్‌బుక్ అందుబాటులో లేని రైతులు సైతం, కేవలం తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి యాప్‌లో లాగిన్ అవ్వొచ్చు. ఆ తర్వాత సులభంగా తమకు కావలసిన ఎరువులను బుక్ చేసుకునే వెసులుబాటును ఈ కొత్త విధానం ద్వారా కల్పించారు.
Urea Booking: బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్.. క్యూలైన్ల శ్రమ నుంచి విముక్తి
మార్కెట్లో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి, అక్రమ రవాణా మరియు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని కట్టడి చేయడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. పారదర్శకమైన విధానంలో అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో ఎరువులు అందేలా ఇది దోహదపడుతుంది. అంతేకాకుండా, ఎరువుల కోసం ప్రాంగణాల్లో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే రైతుల శ్రమను, ఇబ్బందులను పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా ఈ సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.
ముగ్గురు మంత్రులు ఉండి పని చేయలేకపోతున్నారు.. పువ్వాడ ఘాటు విమర్శలు

