Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతులకు మేలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు

రైతులకు మేలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు

వార్త 2 months ago

Harish Rao: రైతులకు మేలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డ హరీష్ రావు… రైతులకు సంబంధించి ఎలాంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

సదాశివపేటలోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన హరీష్ రావు తరువాత స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన శెనగ పంటను ప్రభుత్వ మద్దతులతో కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Shivampet : శివంపేటలో Arrive Alive కార్యక్రమం | రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

 Congress government not good for farmers: Harish Rao

Harish Rao: రైతు సేవా కేంద్రాల తీరుపై ఆగ్రహం

పేరుకే రైతు సేవ కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాలు రైతులకు ఎలాంటి సేవలు చేయడం లేదని అలాంటప్పుడు ఎందుకు ఈ సేవ కేంద్రాలు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ పాలనలో రైతులకు పంట పండించే సమయానికి రైతుబంధు ఇచ్చేవారని ఇప్పుడు ఆ రైతుబంధు ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా పోయిందని వారు అన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయమే మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

ఈ సంవత్సరం పత్తి పంటలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని కనీసం పండించిన శనగలను కూడా కొనలేక కోట అయిపోయిందంటూ తిప్పి పంపడం సరికాదని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ప్రభాకర్ తో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి ఎలాంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సదాశివపేటలోని షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన హరీష్ రావు తరువాత స్థానిక రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు.

పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం

అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన శెనగ పంటను ప్రభుత్వ మద్దతులతో కొనుగోలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే రైతు సేవ కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాలు రైతులకు ఎలాంటి సేవలు చేయడం లేదని అలాంటప్పుడు ఎందుకు ఈ సేవ కేంద్రాలు అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ పాలనలో రైతులకు పంట పండించే సమయానికి రైతుబంధు ఇచ్చేవారని ఇప్పుడు ఆ రైతుబంధు ఎప్పుడు వస్తుందో కూడా తెలియకుండా పోయిందని వారు అన్నారు. పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ విషయమే మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

ఈ సంవత్సరం పత్తి పంటలో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారని కనీసం పండించిన శనగలను కూడా కొనలేక కోట అయిపోయిందంటూ తిప్పి పంపడం సరికాదని ఆయన ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ప్రభాకర్ తో పాటు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణకు అదనంగా 13 ఎంపీ సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha