Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శివంపేటలో Arrive Alive కార్యక్రమం | రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

శివంపేటలో Arrive Alive కార్యక్రమం | రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

వార్త 2 months ago

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన శివంపేటతో పాటు అన్ని గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సోమవారం నిర్వహించిన గ్రామసభల్లో పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు రోడ్డు భద్రతపై సూచనలు ఇచ్చారు. శివంపేట గ్రామసభలో పాల్గొన్న ఎస్‌ఐ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అది ప్రాణ రక్షణ కవచంలా పనిచేస్తుందని సూచించారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించి, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అదే విధంగా పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమవుతుందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి రోడ్డు ప్రమాద రహిత మండలంగా శివంపేటను తీర్చిదిద్దాలని ఎస్‌ఐ మధుకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిపేట వెంకటేశ్వర్, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇంటర్ ఫలితాలు.. నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha