Telangana Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకులు పదేళ్ల కాలంలో చేయలేని పనిని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చేసి చూపించిందని ఆయన కొనియాడారు.
రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులకు భరోసా కల్పించేందుకు ఏకకాలంలో రూ. 21 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు.
Read also: Sangareddy News: తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య
Ponguleti at Hanumakonda Rythu Mela
Telangana Rythu Bharosa: సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న సర్కార్
ఒకప్పుడు వరి పండిస్తే ఉరి అనే భయంకరమైన పరిస్థితులు ఉండేవని, కానీ ఇప్పుడు ఆ భయం లేదని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సన్న రకం వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు రూ. 500 అదనపు బోనస్ ఇస్తున్న ఘనత తమదేనని ఆయన తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా, వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని వెల్లడించారు.
ఆధునిక వ్యవసాయంతో రైతులకు లాభం
రైతులకు కేవలం పెట్టుబడి సాయం అందించడమే కాకుండా, ఆధునిక యంత్రాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 1,200 కోట్లు కేటాయించిందని వివరించారు. ఎకరాకు రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చి రైతును నిజమైన రాజుగా మారుస్తామని ఆయన హనుమకొండ మేళాలో హామీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
లైన్మెన్ను ముంచిన సైబర్ ముఠా.. ఏకంగా రూ. 94 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!

