Ram Pothineni : సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మన్ (Dharman). లోకనాయకుడు కమల్ హాసన్ కు చెందిన 'రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్' ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి (Ram Pothineni ) ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
కీలక తారాగణం మరియు రూమర్లు :
ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుండగా, యువ నటి రాశీ ఖన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో రజనీకాంత్‌కు మామ పాత్రలో సిమ్రాన్ అత్తగా నటిస్తున్నారని, వారి కూతురిగా రాశీ ఖన్నా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు, ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారనే వార్త టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాశీ ఖన్నాకు జోడీగా లేదా రజనీని ఢీకొనే ప్రతినాయకుడిగా రామ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘ధర్మన్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చెన్నై వేదికగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. డాక్టర్ నేపథ్యంలో ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, రామ్ పోతినేని ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన (Official Announcement) వెలువడలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు మాత్రమే. ఈ క్రేజీ కాంబినేషన్ మరియు నటీనటుల పూర్తి వివరాలపై మేకర్స్ త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

