Revanth Reddy Meets Rajnath Singh : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక రక్షణ రంగా ప్రాజెక్టులు, భూ కేటాయింపులు మరియు డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’పై చర్చించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో భాగంగా ప్రత్యేక రక్షణ ఎక్స్‌పోను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎక్స్‌పోను ప్రారంభించి రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేయాల్సిందిగా రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం ఆహ్వానించారు. ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. పారిశ్రామిక, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయి.
Read Also: Konda Surekha : 'కొండా సురేఖ'కు సపోర్ట్ చేస్తున్న ఆ ఇద్దరు మంత్రులు ఎవరు ?
Revanth Reddy Meets Rajnath Singh
Revanth Reddy Meets Rajnath Singh : అనుమతులు, త్రివిధ దళాల సహకారం కోసం విజ్ఞప్తి
ఎక్స్‌పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ నుంచి పలు అనుమతులను సీఎం రేవంత్ కోరారు: విమాన ప్రదర్శనలకు అవసరమైన అనుమతులతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శన ఇచ్చేలా చూడాలని కోరారు. త్రివిధ దళాలకు (భూ, నౌకా, వైమానిక) చెందిన అత్యాధునిక రక్షణ పరికరాలు, స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ప్రదర్శనకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.డీఆర్‌డీఓ (DRDO), హెచ్‌ఏఎల్ (HAL), బీఈఎల్ (BEL), బీడీఎల్ (BDL), ఎండీఎల్ (MDL) వంటి సంస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేలా సూచించాలని కోరారు.
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణ
ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి రక్షణ శాఖ మొత్తం 1,500 ఎకరాల భూమిని కోరింది.దీనికి స్పందించిన సీఎం, ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు.మిగిలిన 750 ఎకరాలను కూడా సేకరించి రక్షణ శాఖకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ (DRDL) చేపట్టే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు TGIIC అంగీకరించిందని సీఎం తెలిపారు.నామమాత్రపు లీజు కింద ఏటా కేవలం రూ. 1 అద్దెతో 33 ఏళ్ల కాలపరిమితికి ఈ భూమిని అందించనున్నారు.అవసరమైతే ఈ లీజును మరో రెండుసార్లు పొడిగించే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు.

