Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రంపంతో విద్యార్థినిపై దాడి.. నిందితున్ని పట్టుకున్న పోలీసులు

రంపంతో విద్యార్థినిపై దాడి.. నిందితున్ని పట్టుకున్న పోలీసులు

వార్త 3 weeks ago

Raptadu Attack Accused Arrested: అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి కేసులో పోలీసులు వేగంగా స్పందించారు.

ఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Raptadu Attack Accused Arrested: సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ధర్మవరంలో అరెస్ట్

పాఠశాలలో చెట్లు నరికే రంపంతో విద్యార్థినిపై విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో విద్యార్థిని ముఖం, వీపు సహా శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయని, చేయి తెగిపోయినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆధారాల ఆధారంగా నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల దర్యాప్తులో నిందితుడిని నాగూరుకు చెందిన హేమంత్‌గా గుర్తించారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఇతను అయ్యవారిపల్లెకు వచ్చి నివాసముంటున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క వద్దే ఉంటున్నట్లు తెలిసింది.

Read Also : Shadnagar Govt Hospital: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. ప్రసవం కోసం వచ్చి తల్లీబిడ్డ మృతి

 Student attacked with a saw; police apprehend the accused

బాధితురాలి తల్లితో సీఎం ఫోన్ సంభాషణ.. లోకేశ్ తీవ్ర ఆగ్రహం

ఈ ఘోర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా బాధిత విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థినులపై ఇలాంటి దాడులు అత్యంత అమానుషమని విచారం వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని బాధితురాలి కుటుంబానికి స్పష్టమైన హామీ ఇచ్చారు.

మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ నిందితుడిని ఉపేక్షించేది లేదని, అత్యంత కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. కఠిన చర్యలకు ఆదేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha