Ranabali : 'రణబాలి' సినిమాపై ప్రేక్షకులలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే థియేటర్ బయట ఓ మహిళా ప్రేక్షకురాలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వస్తున్న రొటీన్ కథల ఎంపికపై ఆమె అత్యంత ఘాటుగా స్పందించారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అందరూ కలిసి ఒక 'పాట్‌లక్' సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎవరి కాన్సెప్ట్ ఏంటో ముందే చర్చించుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఊరిని కాపాడటం, జాతి గుర్తింపు అని చెప్పి ప్రతి సినిమాలోనూ 'కట్-కాపీ-పేస్ట్' తరహా రొటీన్ కథలతో ప్రేక్షకుల బుర్రలు తినొద్దంటూ టాలీవుడ్ మేకర్స్‌కు గట్టిగానే చురకలంటించారు.

ప్రథమార్థం ఓకే.. ద్వితీయార్థంలో సహన పరీక్ష!
ఇక 'రణబాలి' సినిమా కంటెంట్ విషయానికి వస్తే.. ఆమె ఈ చిత్రంపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు భరించే విధంగానే ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం అత్యంత నిదానంగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షగా మారిందని పెదవి విరిచారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే ఒక నిర్దిష్ట సన్నివేశంపై ఆమె పేల్చిన సెటైర్లు, విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రొటీన్ ఫార్ములా సినిమాలతో అలరించడం ఇకపై సాధ్యం కాదని, దర్శకులు కాన్సెప్ట్‌లలో వైవిధ్యం చూపించాలని ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
విజయ్ నటనకు నేను ఎప్పటికీ పెద్ద అభిమానినే.. రష్మిక మందన్న భావోద్వేగ పోస్ట్

