Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలయికలో వస్తున్న సరికొత్త చిత్రం 'రణబాలి'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రషెస్ (సన్నివేశాలు) చూసిన రష్మిక, తన ఉత్సాహాన్ని ఆపుకోలేక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.

'ఆ సీన్లు అద్భుతం.. థియేటర్లలో చూడటానికి ఆగలేకపోతున్నా'
సినిమా విశేషాలను పంచుకుంటూ రష్మిక ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు.. "ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవచ్చో లేదో తెలియదు. గతంలో లాగే ఈ ట్వీట్‌ను కూడా డిలీట్ చేయమని టీమ్ అడగరని ఆశిస్తున్నా. కానీ, ఈ కుర్రాళ్లు స్క్రీన్‌పై నిజంగానే బీభత్సం సృష్టిస్తున్నారు. ఆ సీన్లు చూశాక నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ విజువల్స్ పెద్ద తెరపై చూడటానికి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా" అంటూ రష్మిక పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు హీరో విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌ను కూడా ఆమె ట్యాగ్ చేశారు.
Rashmika Mandanna: 'గీతగోవిందం' కాంబో రిపీట్.. రణబాలిగా విజయ్, జయమ్మగా రష్మిక!
హిట్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ 'రణబాలి' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మందన్న 'జయమ్మ' అనే విలక్షణమైన క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'గీతగోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు మరోసారి ఈ హిట్ జోడీ వెండితెరపై సందడి చేయనుండటంతో ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ క్రేజ్ నెలకొంది.

