Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బాధ్యతల స్వీకరణ

రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి బాధ్యతల స్వీకరణ

వార్త 1 month ago

Rangareddy: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి, పరిపాలనలో తనదైన ముద్ర వేశారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థతతో గుర్తింపు పొందిన ఆమెకు తాజా బదిలీతో రంగారెడ్డి జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగించారు.

Read Also:Choutukur Development: అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న చౌటుకూరు మండల కేంద్రం

Rangareddy: అధికారుల ఘన స్వాగతం

బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని డాక్టర్ కిరణ్మయి తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.జిల్లా అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి, కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లా పరిపాలనలో ఆమె సేవలు ముందుకు తీసుకువస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇకపై విడి నూనె అమ్మితే జైలుకే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha