Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రంగనాథ్‌ను వెంటనే తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు!

రంగనాథ్‌ను వెంటనే తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు!

వార్త 1 week ago

HYDRAA Commissioner Ranganath: తెలంగాణ ప్రాజెక్ట్ 'హైడ్రా' (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ విషయంలో తెలంగాణ హైకోర్టు అత్యంత సంచలన తీర్పును వెలువరించింది.

హైడ్రా కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో తగిన అర్హతలు ఉన్న మరొక అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Read Also :HYDRAA Commissioner: హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

63 సార్లు కోర్టు ఆదేశాల ధిక్కరణ!

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏకంగా 63 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థాన ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, వాటిని విస్మరించి ముందుకు వెళ్లడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను విస్మరించి వ్యవహరిస్తే ఎంతటి ఉన్నతాధికారినైనా చట్టం ముందు నిలబెడతామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అవసరమైతే ఆర్మీని పిలిపించి మరీ కమిషనర్‌ను అరెస్టు చేయిస్తామని గతంలోనే కోర్టు చేసిన హెచ్చరికల తీవ్రతను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అసలు ఏం జరిగింది?

హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణలను అరికట్టడం, ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 'హైడ్రా' వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే, ఇటీవల ఈ సంస్థ చేపడుతున్న కొన్ని చర్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కోర్టు స్టేలు లేదా ముందస్తు ఉత్తర్వులు ఉన్నప్పటికీ, బాధితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ప్రైవేటు ఆస్తుల చుట్టూ కంచెలు వేయడం, కూల్చివేతలకు దిగడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. చట్టబద్ధమైన ప్రక్రియలను అనుసరించకుండా చేసే ఏ చర్య అయినా రాజ్యాంగ విరుద్ధమేనని, అధికారులకు పరిధి దాటి ప్రవర్తించే హక్కు లేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

HYDRAA Commissioner Ranganath: ప్రభుత్వ గ్రాఫ్‌పై ప్రభావం?

ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ హైడ్రా ప్రాజెక్టు, చట్టపరమైన పరిమితులను దాటి వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బలపడితే అది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవడం సమర్థనీయమే అయినప్పటికీ, ప్రతి చర్యకూ చట్టబద్ధత, రెవెన్యూ-మున్సిపల్ పరిధుల స్పష్టత మరియు ముందస్తు నోటీసులు తప్పనిసరి. న్యాయస్థానాల ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పారదర్శకతతో వ్యవహరించినప్పుడే హైడ్రా వ్యవస్థకు విశ్వసనీయత ఉంటుంది.

రాజేంద్రనగర్‌లో రోడ్డుపై పాత TGPSC OMR షీట్లు: కమిషన్ తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha