Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రంగంలోకి సోనూసూద్

రంగంలోకి సోనూసూద్

వార్త 2 weeks ago

Nepal Floods : భారీ వర్షాలు, భీకర వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

తీవ్రమైన కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. భారీ ఎత్తున నిత్యావసరాలు, సహాయక సామగ్రితో (Relief Material) కూడిన విమానంలో ఆయన కాఠ్మాండుకు చేరుకున్నారు. వరద దెబ్బకు సర్వస్వం కోల్పోయిన బాధితులకు అవసరమైన ఆహార పదార్థాలు, దుప్పట్లు, రక్షణ దుస్తులు మరియు తాగునీటిని పంపిణీ చేసే కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

 Nepal floods

పునర్నిర్మాణానికి హామీ: చిన్నారులతో ముచ్చటించిన నటుడు

కేవలం తక్షణ సహాయానికే పరిమితం కాకుండా, వరద బాధితుల జీవితాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి మరియు వారి ఇళ్లను పునర్నిర్మించడానికి తమ వంతు సహాయం అందిస్తామని సోనూసూద్ హామీ ఇచ్చారు. నేపాల్‌లో శిబిరాలను సందర్శించిన సమయంలో అక్కడి చిన్నారులతో ఆయన ముచ్చటించి, ఫొటోలు దిగుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. కాగా, ఈ వినాశకర ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 4,000 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో సోనూసూద్ చేపట్టిన సహాయక చర్యలు నేపాల్ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.

పాకిస్థాన్‌లో దారుణం.. 125 ఏళ్ల నాటి హిందూ దేవాలయం కూల్చివేత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha