Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యా శాంతి ప్రణాళిక: ఇరాన్ అణు సంక్షోభానికి చెక్?

రష్యా శాంతి ప్రణాళిక: ఇరాన్ అణు సంక్షోభానికి చెక్?

వార్త 2 months ago

స్లామాబాద్ చర్చలు విఫలమైన తర్వాత, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. రష్యా ప్లాన్ ప్రకారం..ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యాకు తరలించాలి.

రష్యా ఆ యురేనియాన్ని మరింత సాంకేతికతతో శుద్ధి చేసి, కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పనికివచ్చే అణు ఇంధనంగా మార్చి తిరిగి ఇరాన్‌కు పంపిస్తుంది. దీనివల్ల ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం ఉండదు కాబట్టి, అమెరికా మరియు పాశ్చాత్య దేశాల ఆందోళనలు తొలగిపోతాయి.

Read Also: World Bank: రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ!

 Iran-USA War

Iran-USA War: అయిదేళ్ల గడువుపై చర్చలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 20 ఏళ్ల గడువు కోరగా, ఇరాన్ దానికి నిరాకరించింది. అయితే, రష్యా ప్రతిపాదించిన 5 ఏళ్ల గడువుకు ఇరాన్ ప్రాథమికంగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇప్పటికే పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయంపై చర్చించారు. రష్యా ప్లాన్ బాగున్నప్పటికీ, ఇరాన్ దీనిని పూర్తిగా అంగీకరించడం లేదు. తమ దేశంలోని నిల్వలను విదేశాలకు తరలించడం తమ సార్వభౌమత్వానికి భంగకరమని ఇరాన్ వాదిస్తోంది. తమ దేశంలోనే యురేనియం శుద్ధి చేసుకునే హక్కు తమకు ఉండాలని పట్టుబడుతోంది. జేడీ వాన్స్ స్పందిస్తూ, “బంతి ఇప్పుడు ఇరాన్ కోర్టులోనే ఉంది” అని వ్యాఖ్యానించారు. యురేనియంను పూర్తిగా దేశం వెలుపలికి తరలిస్తేనే తాము ఒప్పందానికి సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది. కానీ రష్యా చెబుతున్న ఈ భద్రతాపరమైన హామీని ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అణు కార్యక్రమం తమ దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని వాదిస్తోంది. తమ దేశంలోనే యురేనియంను శుద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది. తమ దేశంలో ఉండే నిల్వలను విదేశాలకు తరలించడం మా ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

భవిష్యత్తులో ఇరాన్, అమెరికా ఏం చేయబోతున్నాయి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha