Ravi Basrur Emotional Story: సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన రవి బస్రూర్, తన విజయాల వెనుక ఉన్న చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్ లో జరిగిన 'కల్ట్' (CULT) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, తన 18 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విషయాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.'నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు చనిపోదాం అనుకున్నాను. ఈ లైఫ్ వద్దని, భూమ్మీద ఉండకూడదని రెండుసార్లు సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించా.
Cult Teaser Release: 'కల్ట్' టీజర్ చూసారా?
నన్ను రవి బస్రూర్ అని పిలుస్తారు కదా
రెండోసారి నన్ను ఒక వ్యక్తి కాపాడారు. నాకు అవసరమైన కీబోర్డు కొనుక్కోవడానికి 35 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు రవి బస్రుర్ అని మార్చుకున్నా. నేను చనిపోయే వరకూ, నా ఆఖరి ఊపిరి ఉన్నంతవరకూ మీరందరూ నన్ను రవి బస్రూర్ అని పిలుస్తారు కదా! ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ కు నేను థ్యాంక్స్ చెబుతున్నా.

ఇతను నన్ను గుర్తించాడు. ఈ ఇద్దరిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే విశ్వక్ నా జర్నీని, నా సోల్ ని గుర్తించాడు. విశ్వక్ కోసం లైఫ్ టైమ్ ఉంటా. 'కల్ట్' మామూలుగా ఉండదు' అని రవి బస్రూర్ చెప్పుకొచ్చారు. రవి బస్రుర్ కి హైదరాబాద్ లో కూడా ఇళ్లు ఉందని, అది తన ఇల్లే అని ఈ సందర్భంగా విశ్వక్ అన్నారు.25 ఏళ్ల కెరీర్‌లో అందరూ తన లోపల మ్యూజిక్‌ను టాలెంట్ ను మాత్రమే చూశారని, కానీ మొదటిసారి తన ఆత్మను చూసిన వ్యక్తి విశ్వక్ సేన్ అని రవి బస్రూర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇది సంగీత దర్శకులకు దక్కిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com

