Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు

R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు

వార్త 5 days ago

ACB raids on ENC Mohan Nayak: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖలో అత్యున్నత అధికారి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

ఆర్‌అండ్బీ శాఖ ఈఎన్‌సీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ నాయక్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ఉదయం నుంచి విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read also: Visakhapatnam Crime : బిర్యానీ వివాదం..తీవ్ర విషాదానికి దారి

ACB raids on ENC Mohan Nayak: హైదరాబాద్‌తో పాటు స్వగ్రామంలోనూ తనిఖీలు

హైదరాబాద్ నగరంలోని మోహన్ నాయక్ ప్రధాన నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మోపాల్ మండలం కులాస్ పూర్ తండాలోనూ ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. కులాస్‌పూర్ తండాలోని మోహన్ నాయక్‌కు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్‌లోనూ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు.

మోహన్ నాయక్ సొంత ఇళ్లే కాకుండా, ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువుల నివాసాలను కూడా ఏసీబీ వదల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లోని అతని బంధువుల నివాసాల్లో ఉదయం నుంచే ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పట్టుబడిన నగదు, ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

మొబైల్ అలక ప్రాణం తీసింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha