Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

రెండో వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

వార్త 3 weeks ago

India vs West Indies: గువాహటిలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలి వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. మరోవైపు, సిరీస్‌లో పోటీలో నిలవాలంటే వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం కీలకంగా మారింది.

Read Also : Neeru Dhanda: ఏషియన్ గేమ్స్‌లో నీరూ ధాండా సత్తా.. భారత్‌కు షూటింగ్‌లో స్వర్ణం

 Team India won the toss and elected to field in the second ODI.

India vs West Indies: బలమైన బ్యాటింగ్ లైనప్.. అకిబ్ నబీకి అరంగేట్రం

భారత జట్టుకు బ్యాటింగ్ బలం మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తొలి వన్డేలో సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణతో పాటు యువ ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, అకిబ్ నబీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో వచ్చిన అకిబ్ నబీకి వన్డేల్లో ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం.

వెస్టిండీస్‌కు ఎదురుదెబ్బ..

రెండో వన్డేకు ముందు వెస్టిండీస్‌కు గట్టి షాక్ తగిలింది. తొలి వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో కాలి కండరాలు పట్టేయడంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని జట్టు నిర్ణయించింది. కీలక బ్యాటర్ అందుబాటులో లేకపోవడం విండీస్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ.

వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, కేసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్/వికెట్ కీపర్), అమీర్ జంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, విటెల్ లాస్.

నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha