Kamareddy Road Accident: కామారెడ్డి పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఎలక్ట్రిక్ స్కూటీపై ప్రయాణిస్తున్న ఒక బాలుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Read Also : Auto Charges Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్
Scooty crushed between two cars; boy dies.
Kamareddy Road Accident: రెండు కార్ల మధ్య నలిగిపోయిన స్కూటీ
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన హేమంత్ (15), లోకేష్ (16) ఎలక్ట్రిక్ స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఆ రెండు కార్ల మధ్యలో స్కూటీ ఇరుక్కుపోవడంతో హేమంత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్‌ను స్థానికుల సాయంతో హేమంత్ మృతదేహంతో పాటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

