Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు కుటుంబాలకు అండగా నిలిచిన చిరంజీవి

రెండు కుటుంబాలకు అండగా నిలిచిన చిరంజీవి

వార్త 2 months ago

Chiranjeevi financial help: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తను హీరోనే అని నిరూపించుకున్నారు.

తాజాగా వారం వ్యవధిలోనే ఇద్దరు సినీ కార్మికుల కుటుంబాలకు సుమారు ₹20 లక్షల ఆర్థిక సాయం అందించి చిరంజీవి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సినిమా పరిశ్రమలో ఎంతో కాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివనాథ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం భారీగా ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తక్షణమే స్పందించారు. శివనాథ్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10.5 లక్షల భారీ మొత్తాన్ని అందజేయడమే కాకుండా, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చారు.

Read Also: Chandrababu Naidu: చంద్రబాబు సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం ఎప్పుడో తెలుసా?

 Megastar saves two lives with ₹20 lakh.

Chiranjeevi financial help: మాజీ మేనేజర్ కి ₹9.5 లక్షల సాయం

తన మాజీ మేనేజర్ నరసయ్య భార్యకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలిసిన వెంటనే మెగాస్టార్ స్పందించి, సర్జరీ ఖర్చుల కోసం రూ. 9.5 లక్షలు అందజేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే ఆగిపోకుండా, స్వయంగా సర్జరీ ఏర్పాట్లను పర్యవేక్షించి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు.

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దశాబ్దాలుగా రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ లక్షలాది మందికి ఆయన పునర్జన్మ ప్రసాదించారు. కరోనా కష్టకాలం లో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడారు. 'కరోనా క్రైసిస్ చారిటీ' (CCC) ద్వారా చిత్ర పరిశ్రమలోని కార్మికులకు అండగా నిలిచారు. తన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి, ఆ గౌరవాన్ని తన నిరంతర సేవా యజ్ఞంతో సార్థకం చేసుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha