PM Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 23వ విడత నగదు విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది.
జూన్ 20వ తేదీన లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.2,000 చొప్పున నగదు జమ చేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
Read also: Funds to be released: కొత్త ఉద్యోగులకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్: రూ.15 వేల ఆర్థిక సాయం

PM Kisan: పశ్చిమ బెంగాల్ వేదికగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పంపిణీ
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రక్రియ ద్వారా దేశంలోని అన్నదాతల ఖాతాల్లోకి ఈ సొమ్ము నేరుగా చేరనుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాతో పాటు, అగ్రికల్చర్ ఇండియా మరియు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తమ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. అంతకుముందు 22వ విడత నగదును అసోంలోని గువహటి వేదికగా మార్చి 13వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దేశవ్యాప్తంగా 9.46 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో రూ.4.28 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని జమ చేశారు.
పెట్టుబడి సమయానికి రూ.2,000.. సమస్యల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
నైరుతి రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పంటల సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కేంద్రం నుంచి అందుతున్న ఈ రూ.2,000 నగదు రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఉపయోగపడనుంది. నిధుల విడుదలకు ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకుంటున్నారు. పీఎం కిసాన్ నిధులకు సంబంధించి ఏవైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 18001801551 (ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, మరో సహాయక నంబర్ 155261 రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లో తమ స్టేటస్ తనిఖీ చేసుకోవడం ద్వారా తమకు ఈ విడత డబ్బులు వస్తాయా లేదా అనేది ముందే స్పష్టంగా తెలుసుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

